- Connect Mobile Internet To Pc or Laptop|Tethering Net Speed
ఎటువంటి Broadband కనెక్షన్ లేకపోయినా మీరు ఉపయోగిస్తున్న Computer or Laptop కు ఇంటర్నెట్ కనెక్ట్ చెయ్యాలి అని అనుకుంటున్నారా అయితే ఈ ఆర్టికల్ మీకు ఎంతగానో సహకరిస్తుంది. Tethering అనే పద్ధతి ద్వారా దీన్ని చేయవచ్చు
పబ్లిక్ wifi ని ఉపయోగించి నెట్ కనెక్ట్ చెయ్యడం వలన మీ సెన్సిటివ్ డేటా అపహరించబడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
ఈ పద్దతి ద్వారా సురక్షితంగా అదేవిధంగా Net Speed ఇంటర్నెట్ ను ఉపయోగించవచ్చు
What Is Tethering
Mobile Internet ను Pc or Laptop కు కనెక్ట్ చెయ్యడానికి ఉపయోగించే పద్ధతిని Tethering అంటారు
ఈ Tethering అనే పధ్ధతి ద్వారా Mobile Internet ను Pc or Laptop కు కనెక్ట్ చెయ్యడానికి మూడు రకాల పద్ధతులున్నాయి అవి
- Usb Tethering
- Bluetooth Tethering
- Wifi
ఈ ప్రాసెస్ ను మొదలు పెట్టే ముందర మొబైల్ డేటా ఆన్ లో ఉందొ లేదో ఒకసారి చెక్ చేసుకోవడం తప్పనిసరి
నెట్ స్పీడ్ అనేది మొబైల్ సిగ్నల్ స్ట్రెన్త్ పైన ఆధారపడి ఉంటుంది
నెట్ స్పీడ్ తెలుసుకోవడానికి speedtest.net
ఈ మూడు రకాల పద్ధతుల గురించి వివరంగా చూదాం
Usb Tethering

మొబైల్ ను మరియు cpu ను usb కేబుల్ తో కనెక్ట్ చెయ్యండి
ప్రస్తుతం వస్తున్న అన్ని మొబైల్స్ usb పోర్ట్ కు కనెక్ట్ చెయ్యడానికి అనుకూలంగా ఉన్న ఛార్జింగ్ కేబుల్స్ వస్తున్నాయి
మీ మొబైల్ కు వచ్చిన చార్జర్ నే usb కేబుల్ కు సపోర్ట్ అవుతుంది కొత్తగా కొనవలసిన అవసరం లేదు
Android Device Open చెయ్యండి
Settings>Hotspot And Tethering >Usb Tethering Option కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆన్ చెయ్యండి
మొబైల్ లో ఉన్న డేటా కంప్యూటర్ కి ట్రాన్సవర్ అవుతుంది
Bluetooth Tethering
ఈ పద్ధతిలో కేబుల్ అవసరం లేదు
బ్లూటూత్ ఆధారంగా మొబైల్ డేటా ట్రాస్పెర్ అవ్వడం జరుగుతుంది
Generic Ultra-Mini Bluetooth CSR 4.0 USB Dongle కొనుగోలు చెయ్యవలసి ఉంటుంది
Amazon లో 200/- లకు అందుబాటులో ఉంది
USB Dongle కు సంబంధించిన డ్రైవెర్స్ కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసాక మీ మొబైల్ లోని డాటాను బ్లూటూత్ ద్యారా కంప్యూటర్ కు షేర్ చెయ్యవచ్చు
Android Device Open చెయ్యండి
Settings>Hotspot And Tethering > Bluetooth Tethering Option కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆన్ చెయ్యండి
ఒక మొబైల్ నుండి మరియొక మొబైల్ కు అటువంటి Dongle అవసరం లేకుండా డేటా ను Bluetooth Tethering ద్వారా షేర్ చెయ్యవచ్చు
Wifi
Android Device Open చెయ్యండి
Settings>Hotspot And Tethering > Mobile Hotspot Option కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆన్ చెయ్యండి
ఈ పద్దతి ద్వారా మొబైల్ తో మొబైల్ చాల సులభంగా కనెక్ట్ చెయ్యవచ్చు
అదే కంప్యూటర్ విషయానికి వస్తే wifi option ఉండాలి లేదా మొదటి రెండు పద్ధతుల ద్వారా చెయ్యడం మాత్రమే వీలవుతుంది
ఒకవేళ wifi option ఉంటే పై రెండు పద్దతులతో అవసరం లేకుండా చాలా సులభంగా నెట్ కనెక్ట్ చెయ్యవచ్చు